World Cup 2026: Owner recovers' Tolstushka ‘dog that wasn't seen in May with live stream of Mexican fans

A six-year-old dog named 'Tolstushka‘, who went missing on May 24 in Ciudad Victoria, was reunited with the owner after a livestream made by fans after winning the World Cup 2026 group stage 3-0against the Czech Republic. The dog found in the family stream was spotted and taken for a veterinary examination as soon as it was found in the midst of the celebrations; doctors said the dog was in good health and in need of food and rest.
ప్రపంచ కప్ 2026 జోష్ మధ్య మెక్సికోలో ఓ హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. సియూడాద్ విక్టోరియాలో మే 24న కనిపించకుండా పోయిన ‘టోల్స్టుష్కా’ అనే ఆరుగేళ్ల పెంపుడు కుక్క, మెక్సికో జట్టు గ్రూప్ దశలో చెక్ రిపబ్లిక్‌పై 3–0తో గెలిచిన తర్వాత అభిమానులు నిర్వహించిన లైవ్ స్ట్రీమ్ కారణంగా యజమానితో మళ్లీ కలిసింది.
యజమాని అలే గార్సియా రోజూవారీగా ప్రకటనలు పెట్టి, సమాచారం ఇచ్చిన వారికి బహుమతి కూడా వాగ్ధానం చేసినా ఫలితం దొరకలేదు. అయితే మెక్సికో విజయం అనంతరం నగర వీధుల్లో అభిమానులు సంబురాలు జరుపుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించారు. ఆ స్ట్రీమ్‌లో ఒక సమయంలో చేతుల్లో కుక్కను మోస్తూ వెళ్తున్న వ్యక్తి ఫ్రేమ్‌లోకి రావడంతో, దాన్ని గార్సియా సోదరుడు గమనించాడు.

అంతే, కుటుంబం వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి వెంటనే చేరుకుని అక్కడే ‘టోల్స్టుష్కా’ను గుర్తించింది. కుక్క కూడా క్షణాల్లోనే తన యజమానులను గుర్తించి దగ్గరకు వచ్చింది. అనంతరం దానిని వెటరినరీ క్లినిక్‌కు తీసుకెళ్లగా, కొంత ఆహారం, విశ్రాంతి అవసరమైనా మొత్తం ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
“నాకిప్పుడు కలగలుపు భావాలు. మేమంతా ఆందోళన పడుతూ వెతుకుతుంటే, ఆమె మాత్రం ఎక్కడో సరదాగా గడిపేసింది అనిపిస్తోంది,” అని అలే గార్సియా నవ్వుతూ చెప్పింది.
With this unprecedented ‘Happy Ending‘ that has brought the excitement of the World Cup, the collective sentiment of Mexican fans and the power of social media has once again proved itself.